నమస్తే శేరిలింగంపల్లి: సేవా హి సంఘటన్‌లో భాగంగా బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ ఆద్వర్యంలో శేరిలింగంపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి గురువారం ఫేస్ షీల్డ్ మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్‌తో కలసి వైధ్యాధికారి డాక్టర్ రాంరెడ్డికి మూల అనిల్ గౌడ్ ఫేస్‌షీల్డ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలని లెక్కచేయకుండా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆశ వర్కర్లు కలియుగ దైవాలని కొనియాడారు. వైద్య సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తోడుగా వారి రక్షణ విషయంలో స్వచ్ఛంద సంస్థాలు స్థానికులు చేయూతను అందంచాల్సిన అవసరం ఎంతైన ఉందాన్నారు. యూఎస్ఏ నార్త్‌కరోలినా లోని పీడ్మాండ్ తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో శేరిలింగంపల్లిలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో విధిగా ఫేస్ షీల్డ్ మాస్కులను అందజేస్తున్న బిజెపి జిల్లా కార్యదర్శి మూల అనిల్‌కుమార్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది స్వామి, శ్యామల, నీరజ, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
