శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో ఉన్న రేగుల కుంట చెరువు సుందరీకరణలో భాగంగా రూ.60 లక్షల అంచనావ్యయంతో చేపట్టనున్న మురుగు నీరు వ్యవస్థ మల్లింపు (UGD) పైప్ లైన్ నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రేగుల కుంట చెరువు దశ మారిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతుందని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టాలని, అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సందీప్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.