నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ ప్రభు పాద లే ఔట్ కాలనీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభు పాద లే అవుట్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. మురుగు నీటి సమస్య కు శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. డ్రైనేజీ, మంచి నీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రభు పాద లే ఔట్ కాలనీ వాసులు సుధాకర్, వేణు, రామేశ్వర్ రావు, శ్రీకాంత్, ప్రసాద్, సాయి, కార్తిక్, భువన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.