వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాద‌వ్‌

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డివిజన్ అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతున్నామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. నల్లగండ్ల చెరువు నుండి బిహెచ్ఇఎల్ చౌరస్తా ఇండియన్ గ్యాస్ గోడౌన్ నాలా వరకు SNDP అండర్ H-CITI లో భాగంగా రూ. 28 కోట్ల 45 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న ఓపెన్ డ్రైన్ RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నాలాల విస్తరణ పనులతో లోతట్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం అని పేర్కొన్నారు. RCC బాక్స్ డ్రైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రాబోయే వర్షాకాలంలోపు పరిసర ప్రాంతావాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, కాంట్రాక్టర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here