చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తక్కువ సమయంలో ఎక్కు ఓట్లు సాధించి, గట్టి పోటీ ఇచ్చి, ప్రజల మద్దతు పొందారని, జనం కోసం జనంలో ఉండి మరింత పట్టుదలతో పని చేయాలని నిజామాబాద్ ఎంపీ, శేరిలింగంపల్లి ఎన్నికల ఇంచార్జి ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఆయనను చందానగర్ డివిజన్ నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని కసిరెడ్డి సింధూ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి, గెలుపుల గురించి కాకుండా మరింత పట్టుదలతో పని చేయాలని ఆయన సూచించారు. ఎక్కువ ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. పార్టీ కోసం మరింత పట్టుదలతో పని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఉన్నారు.
