- కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి సమన్వయకర్త రఘునంధన్ రెడ్డి
వివేకానందనగర్/చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను వివేకానంద నగర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రఘునందన్ రెడ్డి నిరుపేదలకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ పేరిట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


ఈ సందర్భంగా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కల సాకారం చేసిన మహోన్నతమైన వ్యక్తి సోనియాగాంధీ అని కొనియాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు సోనియాగాంధీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని సోనియా గాంధీ ముందు మోకరిల్లిన కేసీఆర్ మాట తప్పి నేడు తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నాడని అన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కేసీఆర్ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని, భవిష్యత్ లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నే సతీష్, నిజాముద్దీన్, రేణుక, ఇలియాస్ షరీఫ్, నాగమణి, యాదగిరి, శ్రీనివాస్, సీతారామరాజు, సందీప్ రెడ్డి, అయాజ్ ఖాన్, కవిరాజ్, సామ్యూల్, కార్తీక్ పాల్గొన్నారు.
