శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప గార్డెన్స్, క్రాంతి వనం, KNR ప్రైడ్ కాలనీలలో రూ.98 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. కాలనీలు, బస్తీలను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. శేరిలింగంపల్లిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
