శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదాల సంఘం రాష్ట్ర క్యాలెండర్ ను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారు భేరి రామచందర్ యాదవ్‌ల అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చేగొండ రాజన్న యాదవ్, సాయన్న, వెంకట్, ఇజ్జగిరి, మధుకర్, రాజేష్, మొర్రి లింగం, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
