శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశ్రీశ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని తన కుమారులు రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ లతో కలిసి స్వామివారిని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకుని ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని, అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని ఏడుకొండల వెంకటేశ్వరున్ని వేడుకున్నట్లు తెలిపారు.
