శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా జరిగిన అవగహన ర్యాలీలో కొండాపూర్ RTA మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నవీన్, MEO వెంకటయ్య, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రహదారి భద్రతా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత పై అవగహన కలిగి ఉండాలని ,రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు చదువుకునే వయసులో రోడ్డు భద్రత అవగహన అంశాలు బోధిస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా రోడ్డు భద్రత నిమాయలు పాటిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉట్ల కృష్ణ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చాంద్ పాషా, ఉట్ల దశరథ్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, నర్సింహ సాగర్, సత్యం గౌడ్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
