ప్రజలందరూ సంతోషంగా ఉండాలి – సీతారాముల కళ్యాణోత్సవంలో రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన శ్రీరామ‌‌ నవమి వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ నగర్, ఆజ్ బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డి నగర్, ప్రగతి నగర్, దత్తాత్రేయ నగర్, గోకుల్ ప్లాట్స్, మైత్రి నగర్, మియాపూర్ న్యూ కాలనీ, ప్రగతి ఎన్ క్లేవ్, మక్త మహబూబ్ పేట్, ప్రశాంతి నగర్, హఫీజ్ పెట్, కొండాపూర్, మసీదు బండ లోని పలు ఆలయాలను సందర్శించారు.రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక విలువలను తూ.చ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడని, భారతీయుల ఇష్ట దైవమని అని కీర్తించారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాల కోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అని తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని రవికుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న రవికుమార్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here