నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్, పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, దూబే కాలనీ తదితర కాలనీలలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆయా కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ సుఖశాంతుల తో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చింత కింది రవీందర్, కొండల్ రెడ్డి , రమేష్, వేణుగోపాల్ రెడ్డి, రమణ, శ్రీనివాస్ గోపాల్, వెంకటేష్ , కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.