నమస్తే శేరిలింగంపల్లి: నేరాలను, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమైందని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలోని వేణుగోపాల్ స్వామి దేవాలయంలో దొంతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ టీవి కెమెరాలను చందానగర్ సిఐ కాస్ట్రో, ఎస్ఐ సరిత లతో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం సీసీ టీవి కెమెరాలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, అశోక్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, గురుచరణ్ దూబే, దొంతి కార్తిక్ గౌడ్, సాయి కుమార్, పబ్బ మల్లేష్ గుప్తా, రామచంద్రన్, రవిందర్ రెడ్డి, దాసు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.