నమస్తే శేరిలింగంపల్లి: వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు రూ.15.88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2.4 కి.మీ ల మేర నాలా విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాలా వరకు చేపడుతున్న నాలా విస్తరణ పనులలో భాగంగా మదీనగూడలో జరుగుతున్న నాలా విస్తరణ పనులను ఎస్ఎన్ డీపీ సీఈ వసంత, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా విస్తరణతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కానుందన్నారు. రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాల విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాలా నిర్మాణ పనులపై ఎమ్మెల్యే గాంధీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు సమన్వయంతో కలిసి పని చేసి పనుల్లో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, డీఈలు నళిని, శేషగిరి, ఏఈలు పావని, మహేందర్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు జనార్దన్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, ఆంజనేయులు, సాయి, శంకర్, కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.