గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గోపన్ పల్లి రంగనాయక స్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం గచ్చిబౌలి డివిజన్ బిజెపి బూత్ ఇన్చార్జిల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎం. బిక్షపతి యాదవ్, పార్టీ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నందకుమార్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి గంగాధర్ రెడ్డి గెలుపు కోసం బూత్ ఇన్చార్జులు పకడ్బందీ వ్యూహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

టిఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోవాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ లో కాషాయ జెండా ఎగురవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బూత్ ఇన్చార్జీలకు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రవీంద్ర ప్రసాద్ దూబే, వసంత్ కుమార్ యాదవ్, మెయిన్ లాల్, కృష్ణ ముదిరాజ్, నరేందర్ గౌడ్, మట్టా సురేష్, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






