నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రంగ బెంగుళూర్ బేకరీని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించి, వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు విఠల్, వేణు, సుబ్రమణ్యం, రవి, నగేష్, కృష్ణ, నర్సింగ్ నాయక్, స్థానిక నేతలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
