నమస్తే శేరిలింగంపల్లి: ప్రేమలో విఫలం చెందిన కారణంగా నిరాశకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీసుల వివరాల ప్రకారం అస్సాంకు చెందిన సంజు బర్మాన్ (23) అనే వ్యక్తి గోల్డెన్ స్టార్ ఫెసిలిటీస్ లో హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన మహిళతో ప్రేమ విషయంలో వైఫల్యం చెందిన కారణంగా నిరాశతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

