నమస్తే శేరిలింగంపల్లి: జోగిన్ పల్లి బిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐసీటీఈ సహకారంతో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు బుధవారంతో ముగిసింది. ఫ్యూచర్ ఎలక్ట్రికల్ వేహికిలర్ మొబిలిటీ అండ్ ఇట్స్ చాలెంజస్ (ఐసిఎఫ్ఈవిఎంసి-2021) అనే అంశంపై ఆన్ లైన్ అంతర్జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరిగింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్యవక్తగా ఆర్ అండ్ డి డైరెక్టర్ జెబిఐటీ ఆచార్యులు డా.నీరజ్ ఉపాధ్యాయ పాల్గొని సదస్సు ముఖ్య ఉద్దేశం పై ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సు లో సుమారు దేశ విదేశాల నుండి 76 ఆవిష్కరణ పత్రాలు రాగా వాటిలో 48 పేపర్స్ సెలక్షన్ కమిటీ వివిధ కోణాలలో పరిశీలించి స్వీకరించారు. ఈ సదస్సు లో 32 ఆవిష్కరణలు ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉషా శ్రీ మాట్లాడుతూ ఈ సదస్సు కు సహకరించిన కళాశాల మేనేజ్మెంట్ సెక్రెటరీ జె.వంశీదర్ రావు, డైరెక్టర్ ప్రో. జె.గాయత్రి, జేబి గ్రూప్ సీఈఓ మేనేజర్ జనరల్ డా.ఎస్ ఎస్ దసక, జెబి గ్రూప్ సిఏ రాజశేఖర్ రెడ్డి, జెబీ గ్రూప్ డైరెక్టర్ అండ్ కోఆర్డినేటర్ యువిఎస్ఎన్ మూర్తి, డా. వై పి ఓబులేసు, డా.లోహిత్ గోయల్, దేశ విదేశాల నుండి పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డా.రవి కుమార్, హెచ్ఓడీలు, డీన్స్, తదితరులు పాల్గొన్నారు.