శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని శ్రీధర్మపురి క్షేత్రంలో దక్షిణ భారత విభాగ్ ఆధ్వర్యంలో శ్రీరామరాజ్య స్థాపన న్యాస్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మల్లేపల్లి మల్లికార్జున రావు మాట్లాడుతూ కొందరు రామాయణంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. రామాయణం పూర్తిగా అసత్యం అని అంటున్నారని, కానీ అది నిజంగా జరిగిందని తెలిపారు. అసలైన రామాయణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రామాయణం అంటే నిజంగా జరిగిందేనని, అబద్ధం కాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయం సత్యవాణి, ప్లాంజరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శంకర్ నారాయణ, రాజ్యలక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభయ్య, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, అట్లూరి సుబ్బారావు, దివ్యశక్తి పీఠం ఓం స్వరూప్ స్వామి, సీహెచ్ హనుమంత రావు, స్వామి నిత్యానంద, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.