చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌ను శానిటైజ్ చేసిన శేరిలింగంప‌ల్లి కోవిడ్ ర‌క్ష టీమ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్‌ని శుక్ర‌వారం శేరిలింగంప‌ల్లి కోవిడ్ ర‌క్షా టీమ్ శానిటైజ్ చేసింది. ఈ సంద‌ర్భంగా టీమ్ నిర్వాహ‌కుడు రాజుశెట్టి కురుమ మాట్లాడుతూ గ‌తేడాది కొవిడ్ మొద‌లు నేటి సెకండ్ వేవ్ ఉదృతి వ‌ర‌కు పోలీసులు రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న కృషి చేస్తున్నార‌ని, వారి ఆర్యోగ్యానికి భ‌రోసా క‌ల్పిస్తూ ఠాణా మొత్తాన్ని శుద్ధి చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ప్ర‌తిరోజు పోలీస్‌స్టేష‌న్‌, ఆరోగ్య కేంద్రాన్ని శానిటైజ్ చేస్తామ‌ని తెలిపారు. కాగా శేరిలింగంప‌ల్లి కోవిడ్ ర‌క్షా టీమ్‌ను ఇన్‌స్పెక్ట‌ర్ క్యాస్ట్రో ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఐ రాములు, వెంక‌టేష్, బాల్‌రాజు, కోవిడ్ ర‌క్షా టీమ్ స‌భ్యులు ఎల్లేష్ కురుమ త‌దిత‌రులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌ను శానిటైజ్ చేస్తున్న‌ శేరిలింగంప‌ల్లి కోవిడ్ ర‌క్ష టీమ్‌ను అభినందిస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ క్యాస్ట్రో, ఎస్ఐలు రాములు, వెంక‌టేష్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here