భగవద్గీతను అందరూ పఠించాలి: భేరీ రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అఖిల భారత యాదవ మహాసభ రాయదుర్గం దర్గా యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భగవద్గీత అందించిన శ్రీకృష్ణుడు అందరికీ జగద్గురువు అని, ప్రతి ఒక్కరూ భగవద్గీత తప్పనిసరిగా పఠించాలి అని అన్నారు. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో  వాడవాడలా గ్రామ గ్రామాన ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. ఉపాధ్యక్షుడు అల్లాడి యాదవ్, సలహాదారులు శూలం మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నాగపురి కృష్ణ యాదవ్, కార్యదర్శి గోదా సుధాకర్ యాదవ్, భజన విభాగం అధ్యక్షుడు నాగపూర్ అశోక్ యాదవ్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు నాగపురి మహేష్ యాదవ్, మాజీ ఉపాధ్యక్షుడు నాగపురి శ్యామ్ యాదవ్, నాగపురి జనార్ధన్ యాదవ్, నాయకులు కబీర్ దాస్ యాదవ్, బండ రాజ్ యాదవ్ , పి అమర్నాథ్ యాదవ్, నాగపురి బాలరాజు యాదవ్, బండారి మెట్టు ప్రవీణ్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని పూజలు చేస్తున్న భేరి రాంచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here