నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. సోమవారం దూబే కాలనీలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కేంద్రాన్ని దూబే కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ ముదిరాజ్ తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అందులో భాగంగా ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తుందని తెలిపారు. వందశాతం వ్యాక్సినేషన్ కాలనీగా దూబే కాలనీ నిలవాలని, అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ వ్యాప్తంగా పలుచోట్ల మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అందరికి వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని, దగ్గరలో ఉన్న కేంద్రాల వద్దకు వెళ్లి కోవిడ్ టీకా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దూబే కాలనీ ప్రధాన కార్యదర్శి రామస్వామీ, ప్రవీణ్ కుమార్, పోచయ్య, మల్లిఖార్జున ఆచారి, కొండయ్య, హోటల్ శ్రీకాంత్, జితేంద్ర, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.