కరోనా వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ ఇందిరారెడ్డి ఆల్విన్ కాలనీ సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ సదుపాయం కల్పిస్తున్నారని, ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ ను తప్పకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలిస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here