నమస్తే శేరిలింగంపల్లి: యువత తలచుకుంటే సాధ్యంకానిది ఏమీ లేదని, యువత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్, శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి బారిన పడి మృతిచెందిన బీమని రవి కుమార్, పి.విశ్వకంఠ రెడ్డి, రాజేష్ చిత్రపటానికి ఆదివారం నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ ప్రధాన కార్యాలయంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శ్రీ కృష్ణ యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ 2001 సంవత్సరంలో ఎన్నికైన మొదటి కార్యవర్గం ద్వారా సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి యువతను ఒక్క మంచి మార్గంలో నడిపించడం జరిగిందన్నారు. వినూత్న ఆలోచనలతో సమాజానికి మంచి చేయాలనే తపన యువతలో ఉందని అన్నారు. శ్రీ కృష్ణ యూత్ నూతన కార్యవర్గం అధ్యక్షుడు పి.జయ సాయి, ఉపాధ్యక్షులు ఉదయ్, జీ.సంతోష్, జనరల్ సెక్రెటరీ సన్నీ బెనర్జీ, అభిలాష, వీరాస్వామి యాదవ్, జాయింట్ సెక్రటరీ కే.సాయి కుమార్, మున్నూర్ సాయి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.సతీష్ కుమార్, కే.శివానంద, లక్ష్మణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యు.సృజన, మున్నూర్ సందీప్ కుమార్, బి.తరుణ్, పబ్లిక్ రిలేషన్ సెక్రెటరీ ఎం.సాయి రాజ్, బి.అనీష్ రెడ్డి, స్పోర్ట్స్ సభ్యులు గా బి.ఆదిత్య, కే.అఖిల్, ఏ.సుదర్శన్, ట్రేజరర్ రాగం మధుసూధన్ యాదవ్, రూమ్ ఇంఛార్జి రాజు, సుదర్శన్, కల్చరల్ సెక్రటరీ ఎం.ఆగస్టిన్, వై.రాజేష్, సోషల్ మీడియా సతీష్, భాస్కర్, సభ్యులు కే.సంతోష్, బి.సురేందర్, టి.శేఖర్ ముదిరాజ్, బాబేష్ యాదవ్, విష్ణు యాదవ్, సతీష్, శంకర్, రవి తదతరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పి.శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కిరణ్, యాదగిరి, శివ కుమార్ గౌడ్, లక్ష్మణ, సురేందర్, నాగరాజ్ అడ్వకేట్, బాలకృష్ణ, వీరాస్వామి, మల్లేష్, జగదీష్, విజేందర్ రెడ్డి, బాలరాజు ముదిరాజ్, సన్నీ బెనర్జీ, ప్రదీప్, భాస్కర్, సాయి కుమార్, రేవంత్, విష్ణువర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.