ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్ని వర్గాల అభ్యున్నతి, అన్ని రంగాలలో దేశాభివృద్దే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమ‌ని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే , ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి , నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ లింగంపల్లి డివిజన్, మసీద్ బండ చౌరస్తాలో మోదీ చిత్ర పటానికి రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి రవికుమార్ యాదవ్ పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి ఒక మైలురాయి అని కొనియాడారు. ప్ర‌ధాని మోదీ పాలనలో దేశాభివృద్ధికి బలమైన పునాది ప‌డుతుంద‌న్నారు.

మోదీ మూడోసారి ప్ర‌ధానిగా అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నో గొప్ప సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టార‌ని అన్నారు. దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇది 12వ పూర్తి స్థాయి బ‌డ్జెట్ అని, 2014 నుంచి ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అన్నారు. వాటి ఫ‌లితాల‌ను మ‌నం చూస్తున్నామ‌ని అన్నారు. విద్య, వైద్యం, మౌలికవసతుల రంగంలో ఫలాలు కనబడుతున్నాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగుల గౌడ్, ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, కిషోర్, ఆకుల లక్ష్మణ్ , మాణిక్ రావు , రమణయ్య , సత్యనారాయణ, శ్రీశైలం కురుమ , వెంకటస్వామి రెడ్డి, రమేష్ , శ్రీనివాస్ యాదవ్, రవి నాయక్ , రాజు , గణేష్ ముదిరాజ్, శివారెడ్డి, బాబు ముదిరాజ్, ప్రేమ్, శ్రీనివాస్ యాదవ్, కుమార్ యాదవ్, రాయల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here