మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆలిండియా క్రాఫ్ట్స్ మేళాలో సందర్శకులు సందడి చేస్తున్నారు. మేళాకు ముఖ్యంగా మహిళల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తోంది. మేళాలోని స్టాల్స్‌లో అందుబాటులో ఉంచిన మంగళ గిరి, పోచంపల్లి, మదనపల్లి, బెంగాలీ కాటన్, మస్లిన్, మట్కా శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కాశ్మీరీ శాలువాలు, బెడ్ షీట్స్, డెకొరేటివ్ ఐటమ్స్, వాల్ హ్యాంగింగ్స్ మహిళలను ఆకట్టుకుంటున్నాయి.
మంగళవారం సాయంత్రం ఆంఫి థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంజయ్ కుమార్ జోషి శిష్య బృందంచే కథక్, విలసిని నాట్యం ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన సందర్శకులను అలరించింది. కథక్ ప్రదర్శనలో గీత్, తారాణా అంశాలను, విలసిని నాట్యం ప్రదర్శనలో విజ్ఞ వినాశకర, బలిహరణం, పల్లకి సేవ, కుంభ హారతి, హేట్చ్చరిక అంశాలను ప్రదర్శించి మెప్పించారు.