గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో పారిశుధ్యంపై స్పెష‌ల్ డ్రైవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు సీవరేజ్ పైపులైన్ల వ్యర్ధాల తొలగింపు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా జలమండలి నిర్వహించనున్న 90 రోజుల స్పెషల్ డ్రైవ్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ ను డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్నారని తెలిపారు.ఈ స్పెషల్ డ్రైవ్ లో భూగర్భ డ్రైనేజీ పైపులైన్ల స్థితి, సామర్థ్యం పరిశీలిన, అవసరమైతే వాటి సామర్థ్యం పెంచడం, కాలం చెల్లిన పైపు లైన్ల మార్పు, నిత్యం పొంగే మ్యాన్ హోల్స్‌ను గుర్తించి, ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లాంటివి చేస్తారని చెప్పారు.

స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఎయిర్ టెక్ మిషన్లతో ప్రత్యేక సీవరేజ్ బృందాలు రోజూ రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయని వెల్లడించారు.మొదటి మూడు నెలల్లో సీవరేజీ ఓవర్ ఫ్లో ను 30 శాతానికి తగ్గించేందుకు కార్యచరణ అమలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.సేవరేజ్ ఓవర్ ఫ్లో, ఇంకుడు గుంతల నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. వర్షం నీరు వృథాగా పోతున్నాయి, వాటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలనే ఉద్దేశ్యానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. వర్షం నీరు బయటికి పోకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, అపార్ట్మెంట్స్, కాలనీలు అందరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ నరేందర్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, కైలాష్ సింగ్, ప్రకాశ్, బాబ్లు సింగ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లోకేందర్ రెడ్డి, చంద్ర శేఖర్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here