నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గూగులోత్ దస్మా (80) ఇటీవల మృతి చెందడంతో ఎమ్మెల్యే గాంధీ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆకాంక్షించారు.
