శేరిలింగంపల్లి, ఏప్రిల్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ దర్గా, చర్చి బస్తీలలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ, సీసీ రోడ్డు, పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్వయంగా సమస్యలను ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ వెంకట్ రామ్ రెడ్డితో కలిసి స్థానికవాసులతో రచ్చబండ వేదికగా మమేకమై వారి ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించిన కార్పొరేటర్ ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ గోపినగర్, నెహ్రూనగర్ లలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికిగాను వెంటనే కొత్త పైపులైన్ ఏర్పాటు పనులు మొదలు పెట్టాలని సూచించారు. త్రాగు నీరు, మురుగు నీటి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీసీ రోడ్డు మంజూరు కాగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ పనులు పూర్తి చేసిన వెంటనే సీసీ రోడ్డు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదా గౌడ్, దస్తగిరి, రవి, గఫుర్, అశోక్, రజాక్, ఖాజా, నాని, బాలస్వామి, చోటు, చంద్రమౌళి, ప్రవీణ్, ఎజాజ్, జగదీశ్, రాంచందర్, మహిళలు నిరూప, లక్ష్మి, కవిత, గౌసియా బేగం, స్వరూప రాణి, ఎల్లమ్మ, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.