సోషల్ మీడియా వాలంటీర్లు సైనికుల్లా పనిచేయాలి – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: సోషల్ మీడియా వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సైనికునిలా పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు.మియాపూర్ డివిజన్ పరిధిలోని విశ్వనాథ్ గార్డెన్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో సోషల్ మీడియా వాలంటరీల సన్నాహక సమావేశం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ కార్పొరేషన్ చైర్మెన్ మన్నే క్రిశాంక్, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగారావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా పాల్గొన్నారు.‌ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సోషల్ మీడియా వాలంటరీలకు దిశా నిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, పార్టీపై అసత్య ప్రచారాలు, అబద్ధపు విషపు రాతలను తిప్పికొట్టాలన్నారు. ప్రస్తుత రోజులలో ప్రజలకు వాస్తవాలను తెలపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని తెలిపారు.

సోషల్ మీడియా వాలంటీర్ల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

టీఎస్ఎండీఎస్ కార్పొరేషన్ చైర్మెన్ మన్నే క్రిశాంక్ మాట్లాడుతూ సోషల్ మీడియా వారధులకు దిశ నిర్దేశం చేస్తూ ప్రతి అంశంపై సమగ్రంగా వివరించారు. సోషల్ మీడియా వాడకం విధి విధానాల పై పూర్తి స్థాయిలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, రాజు యాదవ్, గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సమ్మారెడ్డి, రాజు నాయక్, లక్ష్మీ నారాయణ, భాస్కర్ , గౌరవ అధ్యక్షులు వాలా హరీష్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారధులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న సోషల్ మీడియా వాలంటీర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here