నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళిత కుటుంబాలలో ఆర్థిక, సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. దళిత బంధు పథకంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పకి చెందిన సౌజన్య కు మంజూరైన టెంట్ హౌజ్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పక్క ప్రణాళికతో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని, ఈ పథకాన్ని సద్వినియోగచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, వేణు గోపాల్ రెడ్డి, నటరాజు, రమణయ్య, బసవయ్య ,జమ్మయ్య, నర్సింహా రెడ్డి, శ్రీకాంత్, నర్సింహ, శ్రీ కళ, అంజమ్మ, భాగ్యలక్ష్మి, జయమ్మ, కల్యాణి, మాధురి, రోజా, శోభ తదితరులు పాల్గొన్నారు.
