నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ కు సందర్శకుల తాకిడితో సందడిగా కొనసాగింది. ఖాదీ చీరలు, చున్నీస్, డ్రెస్ మెటీరియల్స్ మధుబని, మిథిలా పెయింటింగ్ చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నగల పెట్టెలు, రాఖీలు, బుట్టలు, గాజులు, హ్యాండ్ బ్యాగ్స్, బట్ట మీద వేసిన పెయింటింగ్స్ ఆకర్షణీయంగా ఉండడంతో సందర్శుకులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.
బిహారి రుచులు లిట్టి చౌక, ఆంధ్రస, చంద్రకళ గుమ గుమ లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిరీష దేవులపల్లి శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, బీహార్ రాష్ట్రం నుండి వచ్చిన జానపద కళాకారులు భగవతి వందన, లోక్ గీత్, కేజ్రీ, భోజపురి పాటలు విశేషంగా అలరించాయి.