నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్ వీకర్‌సెక్షన్ వాసులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిశారు. మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఇజ్జత్‌నగర్ శ్మశాన వాటిక సమస్యను స్థానిక నాయకులతో కలసి గాంధీకి వివరించారు. స్పందించిన గాంధీ సమస్య తీవ్రతను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దాహాన సంస్కారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలతో స్మశాన వాటికను అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తున్నామని, అదేవిధంగా ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచందర్, సాయి, బాలరాజు, బ్రహ్మయ్య, తైలి కృష్ణ, రంగస్వామి, రామకృష్ణ, ఖాసీం, కృష్ణ, నర్సింగ్, తార్య, యాదమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు.