న‌గ‌రంలోని నాలాల ఆక్ర‌మ‌ణ‌పై మండిప‌డ్డ మేడ్చెల్ బిజెపి మ‌ల్కాజ్‌గిరి జిల్లా మ‌హిళ మోర్చ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నాలాలలో అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ బిజెపి మెడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా కార్య‌వ‌ర్గం జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద నిర్వ‌హించిన దర్నా కార్య‌క్ర‌మంలో మ‌హిళ మోర్చ కార్య‌వ‌ర్గ స‌భ్యురాళ్లు పాల్గొని అధికారుల‌కు విన‌తి పత్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అధ్య‌క్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ న‌గ‌రంలో ఎక్క‌డ చూసిన నాలాలు క‌బ్జాకు గురై చిన్న‌పాటి వ‌ర్షానికే ముంపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని అన్నారు. నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి యుద్ధ‌ప్రాతిప‌ద‌క‌న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అర్బన్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుధా, కార్య‌ద‌ర్శి విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌తో క‌ల‌సి అధికారుల‌తో మాట్లాడుతున్న మెడ్చెల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here