రాయ‌దుర్గం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృత‌దేహం ల‌భ్యం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గుర్తు తెలియ‌ని వ్యక్తి మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న రాయ‌దుర్గం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌చ్చిబౌలి కేర్ హాస్పిటల్‌ వెనుక గ‌ల ఇంజ‌నీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఫుట్‌పాత్ రేకుల‌ను ఆనుకుని 30 నుంచి 40 సంవత్స‌రాల వ‌య‌స్సు గ‌ల పురుషుడి మృత‌దేహం ప‌డిఉంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల ప్రాంతంలో మృత‌దేహాన్ని గుర్తించిన కేర్ హాస్పిట‌ల్ సెక్యూరిటీ సూప‌ర్‌వైజ‌ర్‌ పోలీసుల‌కు స‌మాచ‌రం అందింది. దీంతో పోలీసులు ఆ మృత‌దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా అనారోగ్యంతో కూర్చున్న చోటే స‌ద‌రు వ్య‌క్తి మృతి చెంది ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు బావిస్తున్నారు. ఐతే మృతుడి ఒంటిపై తెలుపు రంగు టీ ష‌ర్టు, గులాబి రంగు కాట‌న్ జీన్స్ ప్యాంట్ ధ‌రించి ఉన్నాడ‌ని, న‌డుముకు మొల‌తాడు ఉంద‌ని, రెండు చేతుల‌కు ప‌లు డిజైన్ల‌తో ప‌చ్చ‌బొట్టు ఉంద‌ని, అత‌నిడి గుర్తించిన వారు రాయ‌దుర్గం పోలీస్‌స్టేష‌న్‌లో స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు.

గుర్తు తెలియని వ్య‌క్తి మృత‌దేహం ఇదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here