నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. జోనల్ కార్యాలయం వద్ద ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గండిచర్ల జనార్దన్ రెడ్డి, సలహాదారులుగా యాదగిరి రెడ్డి, రామ్ చందర్, శివకుమార్, వెంకట్రామిరెడ్డి, లింగయ్య, అధ్యక్షునిగా ఓర్సు వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా మవీన్ గౌడ్, చంద్రయ్య యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, రాజ్ కుమార్, రమేష్, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్, కోశాధికారిగా మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శిగా ఆర్.వెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శివరాత్రి యాదగిరి, సభ్యులుగా పుట్ట శివ, నరసింహ, ముత్యాలు, శాంతన్న, ఎస్.రమేష్, వెంకన్న, వెంకట్ రెడ్డి, సందీప్ రెడ్డిలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఓర్సు వెంకటేష్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు సాగుతామని అన్నారు. పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.
