నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా తిరుపతి నాయక్ ఎన్నికయ్యారు. నడిగడ్డ తండాలో ఆదివారం జరిగిన గిరిజన సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి నాయక్ సోమవారం ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లను మర్యాదపూర్వకంగ కలిశారు. ఈ సందర్భంగా వారు తిరుపతి నాయక్ ను ఘనంగా సన్మనించి శుభాకాంక్షలు తెలిపారు. నడిగడ్డ తండా వాసులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి, తండా అభివృద్ధికి తోడ్పాడును అందించాలని అన్నారు.

నూతన అధ్యక్షుడు తిరుపతి నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోని తండాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు స్వామి నాయక్, హన్మంతు నాయక్, క్రిష్ణ నాయక్, సుధాకర్, కమలాకర్, అబ్రహం, మోహన్, క్రిష్ణ, రాయుడు, శ్రీను, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
