సేవా హీ సంఘ‌ట‌న్‌లో భాగంగా ఆర్టీసీ కార్మికుల‌కు వివేకానంద సేవా స‌మితి భోజ‌నం పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సేవ హీ సంఘటన్‌లో భాగంగా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆర్‌టీసీ కార్మికుల‌కు వివేకానంద సేవా స‌మితి ద్వారా స్పైసి హౌస్ వారు ఉచిత భోజ‌న స‌దుపాయం క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా వివేకానంద సేవా స‌మితి అధ్య‌క్షుడు, బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు జ్ఞానేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ వృత్తిరీత్యా వివిధ జిల్లా నుంచి ఉదయం పూట బస్సుల్లో ప్రయాణికులను తీసుకువచ్చి తిరిగి లాక్ డౌన్ కారణంగా వారి గ్రామాలకు వెళ్లలేక బస్ స్టాండ్ లోనే ఉంటున్న ఆర్టీసీ కార్మికులు అవ‌స్థ‌లు బీఎంఎస్ నాయ‌కుల ద్వారా తెలుసుకుని భోజన సదుపాయాలకు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆల్విన్ x రోడ్ లోని స్పైసి హౌస్ యజమానులు శైలేష్, సమీర్‌ల సౌజ‌న్యంతో ఆర్టీసీ కార్మికుల‌కు గురువారం భోజ‌నం పంపిణీ చేయ‌డం ఎంతో సంతృప్తిని క‌లిగించింద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా స‌మితి ఉపాధ్య‌క్షుడు పృద్వీకాంత్, టీఎస్ఆర్టీసీ బిఎంస్ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, నాయకులు వెంకట్ రెడ్డి, నర్సింగ్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల‌కు భోజ‌నం అంద‌జేస్తున్న వివేకానంద సేవా స‌మితి అధ్య‌క్షుడు జ్ఞానేంద్ర‌ప్ర‌సాద్‌, ఉపాధ్య‌క్షులు పృద్విరాజ్‌, స్పైసీహౌస్ నిర్వాహ‌కులు, బీఎంఎస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here