శేరిలింగంప‌ల్లిలోని ప్ర‌ముఖ వైద్యుల‌ను స‌త్క‌రించిన అల్లం పాండురంగారావు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జాతీయ వైద్యుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మ‌దీన‌గూడ‌ విజ‌య హాస్పిటల్ ఎండీ, భెల్ నేత్ర‌దాన సంచాల‌క‌ర్త, ల‌య‌న్స్ క్ల‌బ్ ప్ర‌ముఖులు అల్లం పాండురంగారావు గురువారం ఘ‌నంగా స‌న్మానించారు. ప్ర‌ముఖ జ‌న‌ర‌ల్ ఫిజీషియ‌న్లు డాక్ట‌ర్ కే.శ్రీధ‌ర్‌రావు, డాక్ట‌ర్ వెంక‌ట్‌ క‌ట్ట‌, గైన‌కాల‌జిస్ట్ డాక్ట‌ర్ సుల‌భ ప్ర‌భాక‌ర్‌, నెఫ్రాల‌జిస్ట్ డాక్ట‌ర్ శ్యామ్‌సుంద‌ర్‌, కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్‌, గ్యాస్ట్రో ఎంట్రాల‌జిస్ట్ డాక్ట‌ర్ బాలా ముర‌ళికృష్ణ‌లను పాండురంగారావు స‌త్క‌రించి జాతీయ వైద్యుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్రాణాల‌కు తెగించి వైద్య‌సేవ‌లు అందించిన డాక్ట‌ర్ల‌కు యావ‌త్ ప్ర‌ప‌చం రుణ‌ప‌డి ఉంటుంద‌ని అన్నారు. అలాంటి ప్రాణ‌దాత‌ల‌ను గౌర‌వంగా స‌త్క‌రించుకునే అవ‌కాశం ల‌భించినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. క‌రోనా కాలంలో వైద్యుల సేవ‌లు సూర్య చంద్రులున్నంత వ‌ర‌కు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ‌ని అన్నారు.

శేరిలింగంప‌ల్లిలోని ప్ర‌ముఖ వైద్యులు శ్రీధ‌ర్‌, సుల‌భ ప్ర‌భాక‌ర్‌, శ్యామ్‌సుంద‌ర్‌, వెంక‌ట్ క‌ట్ట‌ల‌ను స‌త్క‌రిస్తున్న‌ అల్లం పాండురంగారావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here