నమస్తే శేరిలింగంపల్లి: కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ప్రభుత్వ సేవలకు ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల సహకారం తోడవుతుంది. శేరిలింగంపల్లిలో కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ విప్ గాంధీకి సైతం ఇతరుల నుంచి విశేష సహకారం అందుతుంది ఈ క్రమంలోనే సెక్టార్ థెరపియూటిక్ ఇండియా ఎండీ రమేష్ పంచాంగుల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.15 లక్షలు అందజేశారు. సదరు మొత్తానికి సంబంధించిన చెక్‌ను ప్రభుత్వ విప్ గాంధీకి శుక్రవారం అందజేశారు.
కొండాపూర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటుచేసిన జనరిక్ మెడికల్ షాప్ కంప్యూటర్ కొరకు స్ప్రింగ్ ఎల్ సంస్థ వారు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యాల కొరత తీర్చేందుకు తమవంతు సహాయంగా రూ.2 లక్షల ఆర్ధిక సహయం చెక్‌ను సంస్థ ఉపాధ్యక్షులు అమిత్ దేశ్‌పాండే, ఇండియా హెడ్ విద్యలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా నియంత్రణ, రోగులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతల సహకారం తోడవ్వడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా సెక్టార్ థెరపియూటిక్ ఇండియా, స్ప్రింగ్ ఎల్ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.