నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు, వివేకానంద సేవా సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్‌కు ప్రణవీ ఫౌండేషన్ సేవా పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారి పిలుపు మేరకు గత సంవత్సరంలో కరోనా మొదటి దశ లాక్‌డౌన్, ఆ తర్వాత సమయంలో ఆహారానికి ఎవరూ కూడా ఇబ్బందులకు మార్చి 22 నుంచి జులై 18 వరకు వివేకానంద సేవ సమితి వాలంటీర్స్, బిజెపి కార్యకర్తలు, నాయకులు, సంఘ్ పరివార్ మిత్రులతో దాతలు నస్కం ఫౌండేషన్, ఐబిఎం, రామకృష్ణ మిషన్, ఇస్కాన్ ఫౌండేషన్, కోవిడ్ 19 ఎస్‌సీఎస్‌సీ వాలంటీర్స్,సేవ భారతి,సెల్ వెల్ కంపెనీ, డి ఈ సావ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరియు కొంతమంది వ్యాపారస్తులు, సహకారంతో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు కూకట్ పల్లి, రాజేంద్రనగర్, పఠాన్ చేరు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల 35 వేల పై చిలుకూ ఆహార పోట్లలను, 60వేల పై చిలుకు నిత్యావసర సరుకులు (రైస్ కిట్స్)ను పేద ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసి సిబ్బందికి, పోలీస్ అధికారులకు, వైద్య సిబ్బందికి ఇతరులకు వాటర్ బాటిల్స్, మాస్కులు, సానిటైజర్లు, బిస్కెట్లను అదేవిధంగా 4వేల పైగా మహిళా కేర్ కిట్లను అందించామని అన్నారు. అలాగే ఫీడ్ ధ నీడీ సంస్థతో కోవిడ్19 ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లకు పిపిఈ కిట్లను, రోగనిరోధక శక్తిని పెంచేందుకు 20 వేల మందికి హోమియోపతి మందులను అందజేశామని తెలిపారు. ఈ క్రమంలో తమ సేవలను గుర్తించి ప్రణవి ఫౌండేషన్ స్టేట్ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.