సేవా హి సంఘటన్‌లో భాగంగా నిరుపేదలకు నిత్యావసరాలు, కోవిడ్ సేఫ్టీ కిట్లు పంపిణీ…
నమస్తే శేరిలింగంపల్లి: నరేంద్ర మోడి ప్రధానిగా భాద్యతలు చేపట్టి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు శేరిలింగపల్లిలోని బిజెపి నాయకులు సేవా హీ సంఘటన్ అభియాన్ ఘనంగా నిర్వహించారు. అన్ని డివిజన్‌లలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా స్పూర్తిని చాటారు. బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి, లింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్‌లలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. నియోజక వర్గ ఇంచార్జీ గజ్జల యోగానంద్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డిలతో కలసి రవికుమార్ యాదవ్ పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడేళ్ల పరిపాలనలో ఎన్నెన్నో విజయాలు సాధించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్ష నినాదంతో రాజకీయాల కంటే దేశమే ముఖ్యమనే నినాదంతో ఎన్నో ఏళ్లుగా నానుతున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపారన్నారు. ఎన్నో సాహసోపేత నిర్ణయాలతో ,సుపరిపాలనతో దేశాన్ని నడిపిస్తూ యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన గొప్ప మహనీయుడు నరేంద్రమోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్చర్ల ఎల్లేష్, రాధా కృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, హనుమంతు నాయక్, కృష్ణ గౌడ్, రంగస్వామి, రమేష్, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్‌పేట్ డివిజన్‌లో…
ఇందిరారెడ్డి ఆల్విన్ కాలనీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ వలస కూలీలకు, జీహెచ్ఎంసి కార్మికులకు ఇతర నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు వారధిగా నిలుస్తూ రెండోసారి ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు అని స్వయం ప్రకాశిత భారత్ లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలతో సమర్థవంతమైన పాలన అందిస్తోన్న నరేంద్రమోదీకి దేశ ప్రజ రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, పృథ్వి కాంత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్‌లో…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ సహకారంతో రాయదుర్గంలో, జిల్లా సహాయకార్యదర్శి రవిందర్‌రెడ్డి ఆద్వర్యంలో టెలికం నగర్‌లో, జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, నాయకులు శంకర్‌యాదవ్, కిషన్ సింగ్ ఆద్వర్యంలో గౌలిదొడ్డిలో, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్‌నాయక్ ఆద్వర్యంలో గోపన్‌పల్లి తండాలో, సీనియర్ నాయకుడు శివసింగ్ ఆద్వర్యంలో నానక్‌రాంగుడాలో, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం, విఠల్, నగేష్‌ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు నిత్యావసరాలు, కరోనా సేఫ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడి స్పూర్తితో తమ డివిజన్‌లో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణముదిరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్‌లో…
చందానర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి ఆద్వర్యంలో పద్మజా కాలనీలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు సంవత్సరాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రధాని మోడి ఎంతో భరోసా కల్పించారని అన్నారు. అదేవిధంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు డీఎస్ఆర్‌కే ప్రసాద్ స్వయంగా నిరుపేదలకు ఎన్ 95 మాస్కులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జ్ఞానాచారి, నరేంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, సీతారామ్ రెడ్డి, రవికాంత్, శ్రీకాంత్, ప్రసాద్, రత్న కుమార్, రవీంద్ర నాయక్, రాజు, పృథ్వి, గిరి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్‌లో…
బిజెపి శేరిలింగంపల్లి అధ్యక్షుడు రాజుశెట్టి ఆద్వర్యంలో జీ.వై ఫౌండేషన్ మ్యానేజింగ్ ట్రస్టీ గజ్జల యోగానంద్ సహకారంతో సానిటైజేషన్ వాహనాన్ని ప్రారంభించి రాజీవ్ గృహ కల్పా వీధుల్లో సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. అదేవిధంగా వీధి వ్యాపారులకు మస్కులు, ఫేస్ షీల్డ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్‌లో…
మియపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏనగర్, మక్త మహబూబ్‌పేట్‌లలో బిజెపి రాష్ట్ర నాయకులు కలివేముల మనోహర్ ఆద్వర్యంలో మాస్కులు, ఫేస్ షీల్డ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ దేశప్రజలకు సేవచేయడంలో ప్రధాని నరేంద్ర మోడికి మించిన పరిపాలన దక్షకుడు మరోకరు లేరని అన్నారు. కార్యక్రమంలో మియాపూర్ అధ్యక్షుడు మాణిక్య రావు, నారాయణ రెడ్డి , రామకృష్ణ, విజేందర్ సింగ్, గణేష్ , వినయ్ ప్రసాద్ మొదలగు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ డివిజన్‌లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో స్థానిక బిజెపి ఇన్చార్జీ టీవీ మధనాచారి ఆద్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు శానిటైజర్లు పంపిణీచేయడం చేశారు. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథి సీనియర్ నాయకులు ఎంవికుమార్ యాదవ్, మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కొర్పొరెటెర్ గంగల రాధాకృష్ణ యాదవ్‌లు పాల్గొని నిరుపేదలకు నిత్యావసర వస్తులువు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ శ్రీనివాస్, పవన్ కుమార్,అశోక్, వెంకటేష్,రఘుయాదవ్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
వివేకానందనగర్ డివిజన్‌లో…
వివేకానంద డివిజన్ పరిధిలో డివిజన్ బిజెపి ఇన్చార్జ్ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, నియోజకవర్గ నాయకులు ఏకాంత్ గౌడ్‌ల ఆద్వర్యంలో స్థానిక ఆటో డ్రైవర్లకు ఫేస్ షిల్డ్స్, ఫేస్ మాస్కులు, శానిటైజర్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా మోడీ భాద్యతలు చేపట్టి ఏడేళ్లలో స్వయం ప్రకాశిత భారత్ లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలతో సమర్థవంతమైన పాలన అందిస్తున్నాడని కొనియాడారు.
కసిరెడ్డి సింధు రఘునాథ్‌రెడ్డి ఆద్వర్యంలో…
బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రఘునాథ్‌రెడ్డి ఆద్వర్యంలో డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం 100 ఏండ్లలో ఎన్నడూ ఎదుర్కోని విపత్తులను ఎదుర్కొంటున్నదని అన్నింటినీ ధైర్యంగా తట్టుకుంటూ ప్రధాని మోడి ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, వనమా శ్రీనివాస్, శ్రీనివాస్ ముదిరాజ్, వంశీధర్ రెడ్డి, అమిత్ దూబే, రత్నాకర్, మమత తదితరులు పాల్గొన్నారు.
కుమ్మరి జితెందర్ ఆద్వర్యంలో…
బీజేవైయం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ ఆద్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్‌లోని ఓల్డ్ హఫీజ్‌పేట్, శ్రీ సాయి రాం కాలనీ, సాయి నగర్ ప్రాంతాల్లోని వివిధ దేవాలయలకు చెందిన పూజరుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం నాయకుడు శివాజీ, బీజేవైయం హఫీజ్‌పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, నాయకులు సంజయ్ గౌడ్ ,కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.