నమస్తే శేరిలింగంపల్లి: ప్రధాని నరేంద్రమోడీ పాలన ఏడు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. లింగంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించిన అల్పాహారం వితరణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ మాట్లాడుతూ అనేక సంహాత్సరాలుగా పెండింగ్ లో వున్న ట్రిపుల్ తలాక్ రద్దు, కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దులతో పాటు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని అన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టి శతాబ్ధాల కలను నేరవేర్చిన ఘనుడు అని కొనియాడురు. అదేవిధంగ కరోనా మహమ్మారి అంతానికి పంతం పట్టారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడు సంహాత్సరాలుగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు కురుమ, రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారీ, సత్య కురుమ, సీనియర్ నాయకులు రాఘవేందర్ రావు, బీజేవైఎం నాయకులు నీరటి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.