శేరిలింగంప‌ల్లిలో భారీ వ‌ర్షం… దీప్తీశ్రీన‌గ‌ర్ వ‌ర‌ద‌ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లిలో ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని దీప్తీశ్రీన‌గ‌ర్‌లో లోత‌ట్టు ప్రాంతాల‌ను ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ. మియాపూర్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌లు జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ నేడు కురిసిన అకాల వర్షానికి కాలనీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం వలన కాలనీ వాసులు ఇబ్బంది పడకూడదు అని తగు చర్యలు తీసుకున్నామని, ఎక్కడికక్కడ నీరు ప్రవహించేలా స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. అసంపూర్తిగా ఉన్న‌ దీప్తి శ్రీ నగర్ నాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన ప‌నులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారుల‌కు సూచించారు. వరద ముంపు తగ్గించడానికి ఎక్కడికక్కడ ఔట్ లెట్‌ల‌ను శుభ్రం చేయించ‌డం జ‌రిగింద‌ని, అక్క‌డ‌ పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చేశామని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌ ఏఈ అనురాగ్ మ‌హాదేవ్‌, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

నీరు నిలిచిన ప్రాంతాల్లో స‌త్వ‌ర చ‌ర్య‌ల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here