నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గౌడ్‌లైన్స్‌కి విరుద్ధంగా కరోనా బాధితుల నుండి అడ్డగోలుగా చార్జీలు వసూళ్లు చేస్తున్న ప్రవేటు ఆసుపత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆక్సిజన్ మరియు రెమిడిసివర్ ఇంజంక్షన్ల బ్లాక్ మార్కెట్ దందాపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలని, కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఎద్దేవా చేశారు. ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రత్యక్షంగా ఆసుపత్రులను సందర్శించి మెరుగైన వసతులు కల్పించక ఆస్క్ కెటిఆర్ పేరుతో ట్విట్టర్ వేదికగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్లు, కాలేజీలు మరియు ఫంక్షన్ హాల్లను వెంటనే ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలని, ప్రజల ప్రాణాలకు భరొసా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి లేనియెడల తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసి కరోనా నుండి ప్రజలను ఆర్థికంగా కాపాడాలని అన్నారు. ప్రభుతం నిర్ణయించిన ధరలకె కరోనకు వైద్యం అందించాలి అని అన్నారు. రేమిడేసివర్ ఇంజెక్షన్లు బ్లాక్ లో విక్రయించకుండా, ఎంఆర్‌పీ ధరలకే అందించే విధంగ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా వెంటిలేటర్లు ఏ ఆసుపత్రిలో ఖాలిగా ఉంటే స్థానిక రోగులకు అక్కడ అవకాశం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.