తానా ఫౌండేషన్ కో ఆర్డినేట‌ర్ హితేష్ వ‌డ్ల‌మూడి ఔదార్యం… రూ.2 ల‌క్ష‌ల విలువ గ‌ల ఆక్సిజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్స్ గాంధీకి అంద‌జేత‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్‌బండకు చెందిన వడ్లమూడి కృష్ణమూర్తి, భరణి దంపతుల కుమారుడు హితేష్ వడ్లమూడి ఇటీవల జరిగిన తానా సంస్థాగత ఎన్నికలలో ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్‌గా విజ‌యం సాధించిన‌ సందర్భంగా రూ. 2 ల‌క్ష‌ల విలువ గ‌ల‌ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గారికి గురువారం అందచేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సేవ చేయడానికి ముందుకు వచ్చిన తానా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ హితేష్ ఔదార్యం ఎంతో గొప్పదని అన్నారు. ఎక్కడో అమెరికాలో ఉండి మన ప్రాంత ప్రజల కోసం ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు తోచిన విధంగా సహాయం చేయడం అభినందనీయమ‌ని, వారిని ఇత‌రులు ఆదర్శంగా తీసుకొవాల‌ని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత దృక్పథంతో ఎదో తోచిన విధంగా తమ వంతు సహాయం చేయడానికి అంద‌రు ముందుకు రావాలని గాంధీ పిలుపునిచ్చారు. హితేష్, వారి తల్లిదండ్రులను, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావుల‌ను గాంధీ ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఆక్సిజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్ల‌ను ప్ర‌భుత్వ విప్ గాంధీకి అంద‌జేస్తున్న హితేష్ త‌ల్లితండ్రులు కృష్ణ‌మూర్తి, భ‌ర‌ణి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here