శేరిలింగంప‌ల్లిలోని నాలుగు బ‌స్తీల్లో ప‌ర్య‌టించిన రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌… భూగ‌ర్భ డ్రైనేజీ ప‌నుల ప‌రిశీల‌న‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, బాపు నగర్, ఆదర్శనగర్, నెహ్రూనగర్‌ల‌లో స్థానిక కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. స‌ద‌రు బ‌స్తీల్లో పాద‌యాత్ర చేస్తూ స్థానికంగా కొన‌సాగుతున్న భూగ‌ర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను రాగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ తాజాగా చేప‌డుతున్న భూగ‌ర్భ డ్రైనేజీ పనులతో స్ధానికుల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగ‌నుంద‌ని అన్నారు. వ‌ర్షాలు మొద‌లైన నేప‌థ్యంలో జాప్యం చేయకుండా ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. భ‌విష్య‌త్తులో మురుగు నీరు రోడ్ల‌పైకి రాకుండా శ్వాస్వత పరిష్కారం దిశ‌గా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అభివృద్ధి ప‌నుల్లో నాణ్యత ప్ర‌మాణాల విష‌యంలో రాజీ ప‌డేది లేద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సునీల్, యాదగిరి, వెంకట్ రెడ్డి, సూపర్‌వైజ‌ర్‌ మోహన్, నాయ‌కులు గోపాల్ యాదవ్, రాజుకుమార్, శ్రీకాంత్, పిల్లి యాదగిరి, సాయి, సుభాష్, మోహన్ రెడ్డి, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

అధికారులు, స్థానిక నాయ‌కుల‌తో క‌ల‌సి భూగ‌ర్భ డ్రైనేజీ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here