అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఆన్నార్తుల‌కు ఆర్‌కేవై ప్రాణ‌హేతు నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్‌లోని నిరుపేద‌ల‌కు ర‌వికుమార్ యాద‌వ్‌(ఆర్‌కేవై) ప్రాణ‌హేతు చేయూత‌నందించింది. బిజెపి రాష్ట్ర నాయ‌కులు మార‌బోయిన ర‌వికుమార్ యాద‌వ్ శుక్ర‌వారం అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లో ప‌నిచేసే రోజువారి కూలీలు, నిరుపేద‌ల‌కు శుక్ర‌వారం నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయి చాల‌మంది నిరుపేద‌లు అవ‌స్థ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని, వారి ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని ఆర్‌కేవై ప్రాణ‌హేతు ద్వారా తోచిన స‌హ‌కారం అందిస్తున్నామ‌ని అన్నారు. బాదితుల అవ‌స‌రాల‌ను బ‌ట్టి నిత్యావ‌స‌రాల‌తో పాటు రోజువారి భోజ‌నం, మందులు సైతం పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ అవ‌కాశాన్ని నిరుపేద‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజేవైఎం రాష్ట్ర నాయ‌కుడు క‌సిరెడ్డి ర‌ఘునాథ్‌రెడ్డి, అలిగెరి అర్జున్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్, ర‌ఘునాథ్‌రెడ్డి,అర్జున్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here