గోకుల్ ప్లాట్స్‌లో ప‌ర్య‌టించిన కార్పొర‌ట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌… నాలా విస్త‌ర‌ణ ప‌నులు, డ్రైనేజీ స‌మ‌స్యల‌ ప‌రిశీల‌న‌…

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో స్థానిక కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. స్థానికంగా కొన‌సాగుతున్న‌ నాల విస్తరణ పనులు ప‌రిశీలించారు. అదేవిధంగా స్థానికంగా నెల‌కొన్న డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలించారు. అభివృద్ధి ప‌నులలో నాణ్య‌ప్ర‌మాణాలు పాటించాల‌ని, ప‌నుల‌లో జాప్యం త‌గ‌ద‌ని సంబంధిత అధికారుల‌కు అయ‌న సూచించారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన సౌక‌ర్యాల క‌ల్ప‌నే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, నాయ‌కులు నాగేశ్వర్ రావు, జి.వి.రెడ్డి, సంజీవ్ రెడ్డి, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, దుర్గ రావు, పితాని శ్రీనివాస్, ప్రభాకర్, సాంబయ్య, లక్మి, శ్రీనివాస్, వీర రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కొండల్ రావు, వెంకట్ రావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానికుల‌తో క‌ల‌సి గోకుల్‌ప్లాట్స్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here