శేరిలింగంప‌ల్లి బస్తీ ద‌వ‌ఖానాల సిబ్బందికి ల‌య‌న్స్‌క్ల‌బ్ ఆఫ్ బంజారహిల్స్‌, ల‌య‌న్ డిస్ట్రీక్ 320ఏ చేయూత‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లిలోని బ‌స్తీ ద‌వాఖానాల సిబ్బందికి ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ బంజారాహిల్స్‌, ల‌య‌న్ డిస్ట్రిక్ట్ 320ఏ చేయూత‌నందించింది. గంగారం, న‌డిగ‌డ్డ తండా, హెచ్ఎంటీ కాల‌నీ, ప్రేమ్‌న‌గ‌ర్‌, కొత్త‌గుడాల‌లోని బ‌స్తీ ద‌వాఖానాల సిబ్బందికి ల‌య‌న్స్‌క్ల‌బ్ ఆఫ్ బంజారాహిల్స్‌, ల‌య‌న్ డిస్ట్రీక్ 320ఏ ప్ర‌తినిధు అమ‌ర్‌సింగ్ సేఫ్టీ కిట్లను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తూ సేవ‌లందిస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బందికి ల‌య‌న్స్ క్ల‌బ్ త‌ర‌పున తోచిన స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే 100 ద‌వ‌ఖానాల సిబ్బందికి సేఫ్టీ కిట్ల‌ను అంద‌జేస్తున్న‌ట్టు తెలిపారు. హ‌ఫీజ్‌పేట్ ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం అసిస్టెంట్ ప్యారా మెడిక‌ల్ ఆఫీస‌ర్ ర‌మేష్ నాయ‌క్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సేవ‌ల‌ను గుర్తించి, ర‌క్ష‌ణ కోసం శ్ర‌ద్ధ వహిస్తున్న ల‌య‌న్స్ క్ల‌బ్ ప్ర‌తినిధులకు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గంగారం బ‌స్తీ ద‌వ‌ఖానా డాక్ట‌ర్ కీర్తీ, హెచ్ఎంటీ కాల‌నీ డాక్ట‌ర్ స్వాతి, న‌డిగ‌డ్డ తండా డాక్ట‌ర్ రోహిణి, న‌డిగ‌డ్డ తండా ప్ర‌ముఖులు ద‌శ‌ర‌థ్ నాయ‌క్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌డిగ‌డ్డ తండా బ‌స్తీ ద‌వ‌ఖానా డాక్ట‌ర్ రోహిణికి సేఫ్టీ కిట్ల‌ను అంద‌జేస్తున్న హ‌ఫీజ్‌పేట్ యూపీహెచ్‌సీ ఏపీఎంఓ ర‌మేష్ నాయ‌క్, తండా ప్ర‌ముఖులు ద‌శ‌ర‌థ్‌నాయ‌క్‌, ల‌య‌న్స్‌ క్ల‌బ్ ప్ర‌తినిధి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here